PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెంచురీ ఆస్పత్రిలో ర‌క్తదాన శిబిరం

1 min read

– 35 మందికి పైగా యువ‌తీయువ‌కుల ర‌క్తదానం

హైద‌రాబాద్: ప్రపంచ ర‌క్తదాన దినోత్సవం సంద‌ర్భంగా బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆస్పత్రి బ్లడ్‌బ్యాంక్ ప్రాంగ‌ణంలో ర‌క్తదాన శిబిరాన్ని బుధ‌వారం నిర్వహించారు. బిల్డాక్స్ సంస్థకు చెందిన కొంద‌రు ఉద్యోగుల‌తో పాటు చుట్టుప‌క్కల ప్రాంతాల‌కు చెందిన యువ‌తీ యువ‌కులు ఉత్సాహంగా ఈ శిబిరంలో పాల్గొని ర‌క్తదానం చేశారు. సుమారు 35 మంది వ‌ర‌కు బుధ‌వారం ర‌క్తదానం చేశారు. ఈ సంద‌ర్భంగా సెంచురీ ఆస్పత్రి సీఈవో డాక్టర్ హేమంత్ కౌకుంట్ల మాట్లాడుతూ, ‘‘ర‌క్తదానం అనేది ప్రాణ‌దానం లాంటిది. 18 ఏళ్ల వ‌య‌సు నిండిన‌వారు ఎవ‌రైనా ర‌క్తం దానం చేయొచ్చు. అలా చేయ‌డం వ‌ల్ల గుండెకు సంబంధించిన స‌మ‌స్యలు రాకుండా ఉంటాయి, ర‌క్తంలో చెడు కొలెస్టరాల్ శాతం కూడా త‌గ్గుతుంది. అందువ‌ల్ల ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ప్రతి మూడు నెల‌ల‌కోసారి ర‌క్తాన్ని ఇవ్వడం మంచిది. దానివ‌ల్ల ఆప‌ద‌లో ఉన్నవారి ప్రాణాలు కాపాడిన‌ట్లు అవుతుంది. ఇప్పటికీ మ‌న దేశంలో చాలామంది స‌రైన స‌మ‌యానికి త‌మ‌కు కావ‌ల్సిన గ్రూపు ర‌క్తం దొర‌క్క ప్రాణాలు కోల్పోతున్నారు. హీమోఫీలియా లాంటి వ్యాధులు ఉన్నవారికి మ‌రింత త‌ర‌చుగా ర‌క్తం అవ‌స‌ర‌మ‌వుతుంది. అందువ‌ల్ల బాధ్య‌త క‌లిగిన పౌరులుగా స్త్రీలు, పురుషులు అన్న భేదం లేకుండా ఎవ‌రైనా కూడా ర‌క్తదానం చేయ‌డానికి  ముందుకు రావాలి’’ అని ఈ ప్రపంచ ర‌క్త‌దాన దినోత్స‌వం సంద‌ర్భంగా పిలుపునిచ్చారు.

About Author