ఆర్టీసీ డిపోలో రోడ్డుభద్రత మా మాసోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం
1 min read
ఒక్కరు రక్తదానం చేస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడిన వారవుతారు
ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ బి.వాణి
60 మంది కార్మికులు రక్తదానం
ఏపీఎస్ఆర్టీసీ,రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం రక్తదానం కార్యక్రమం జరిగింది.అందులో భాగంగా దాదాపు 60 మంది కార్మికులు రక్తదానం చేశారు.ఏలూరు ,నూజివీడు,జంగారెడ్డి గూడెం డిపోల నుండి నుండి ఈ కార్మికులందరూ వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ఏలూరు డిపో మేనేజర్ బి.వాణి మాట్లాడుతూ ఒకరు రక్త దానం చేయడం వల్ల ముగ్గురికి ప్రాణదాతలుగా మిగులుతారని అదేవిధంగా మనుషుల ప్రాణం కాపాడేది కేవలం రక్తమేనని ఆ విలువ తెలుసుకొని రక్తదానం చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలని నిలబెట్టిన వారమవుతామని ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ చేసేటటువంటి తల సేమియా చిన్నారులకి రక్తదానం వారి జీవితంలో మరికొన్ని రోజులు బ్రతికించేటటువంటి ఆశని చిగురుంప చేస్తుందని ఆ చిన్నారుల ఆనందంగా ఉండగలుగుతారని ఇటువంటి బృహత్తర కార్యక్రమం చేస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ వరకు ప్రతి సంవత్సరం రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రక్తదానం రోజున కేవలం వారికి మాత్రమే ఈ రక్తాన్ని అందించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ నుండి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాదరావు,పి ఆర్ .ఓ .కె .వి. రమణ,ఆర్ఎం ఆఫీస్ సూపర్డెంట్ పి .వేణుగోపాలరావు,పి ఆర్ .ఓ ,కే. ఎల్. వి .నరసింహం,AMT శ్రీ జి. మురళీ, ఎం.ఎఫ్ ఐ ప్రేమ్ కుమార్ అనేక మంది కార్మికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ వారు సంయుక్తంగా నిర్వహించారు.భవదీయుడుకేఎల్వి నరసింహంపిఆర్ఓ.