కప్పట్రాళ్ల లో నేడు రక్తదాన శిబిరం
1 min readపల్లెవెలుగువెబ్, పత్తికొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో డీఐజీ ఆకెపోగు రవికృష్ణ ఐపీఎస్ జన్మదినం సందర్భంగా సోమవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో గ్రామ ప్రజలు శాంతియుత జీవనం సాగించలేక నానా అవస్థలు పడేవారు. ఈ పరిస్థితులను గమనించిన అప్పటి కర్నూలు ఎస్పీ ఆకె పోగు రవి కృష్ణ ఐపీఎస్ కప్పట్రాళ్ల గ్రామాన్ని ఫ్యాక్షన్ నుండి విముక్తి చేయాలని నిర్ణయించుకున్నారు. కప్పట్రాళ్ల గ్రామాన్ని మమేకం చేశారు. అన్ని విధాల అభివృద్ధి బాట పట్టించారు. గ్రామంలో ఎలాంటి కక్షలు, కార్పణ్యాలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రజలను ఐకమత్యంగా మెలిగేలా చేశారు. ఎస్పీ రవికృష్ణ గ్రామ ప్రజల మధ్య స్నేహ భావాన్ని ఏర్పర్చారు. గ్రామంలో కనీస వసతులు, సదుపాయాలు కల్పించారు. దీంతో గ్రామ ప్రజలు సహజీవనం తో కక్షలు కార్పణ్యాలు కు దూరంగా శాంతియుత జీవనం సాగిస్తున్నారు. ఎస్ పి రవికృష్ణ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి పరిచారు. ఎస్పీ కర్నూల్ నుండి తిరుపతికి బదిలీ అయినప్పటికీ గ్రామాన్ని మర్చిపోకుండా ఇప్పటికి గ్రామాభివృద్ధి కోసం పాటు పడుతూనే ఉన్నారు. గ్రామ ప్రజలు సైతం తమ అభివృద్ధికి పాటుపడిన అప్పటి ఎస్పీ.. ప్రస్తుతం డీఐజీ రవికృష్ణ జన్మదినం సందర్భంగా కప్పట్రాళ్లలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.