ప్రధాని పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు
1 min readసెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు జరుగుతున్న సేవా పక్వాడ కార్యక్రమాలు..
శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ వద్ద మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా డి సి హెచ్ ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి హాజరయ్యి రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా డి సి హెచ్ ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్ మాట్లాడుతూ సేవ పక్వాడ కార్యక్రమాల్లో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం, ఇతర సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.103వ సారీ రక్తదానం చేసిన బావిశెట్టి చిరంజీవిరావును డి సి హెచ్ ఎస్ అభినందించారు.రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి మాట్లాడుతూసేవా పక్వాడ పక్షోత్సవాలలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ కనీసం 5 రక్తదాన శిబిరాలు, 5 సేవా కార్యక్రమాలు, 5 సామాజిక అవగాహన కార్యక్రమాలను నిర్వహించే కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగా 5 రక్తదాన శిబిరాలను ఏలూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెంలలో నిర్వహిస్తున్నామని అన్నారు. ఈరోజు జరిగిన మెగా రక్తదాన శిబిరంలో 72 మంది యువకులు రక్తదానం చేశారని కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మరియు కళాశాల ప్రిన్సిపాల్ కి కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి. బెన్నీ, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె ప్రసాద్ రావు, బావి శెట్టి చిరంజీవి రావు, పిఆర్ఓ కెవి రమణ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.