PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల, డివిజన్ స్థాయిలోను రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టండి

1 min read

యువతి యువకులు అందరూ రక్తదానం మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి

జిల్లా కలెక్టర్ డా జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మండల, డివిజన్ స్థాయిలోను రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు, రెడ్ క్రాస్ సొసైటీ వారికి జిల్లా కలెక్టర్ డా జి.సృజన సూచించారు. శుక్రవారం స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణంలో ప్రపంచ రక్తదాన దినోత్సవం  సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ వారితో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని  జిల్లా కలెక్టర్ డా జి.సృజన ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ రక్తదాన దినోత్సవం చాలా ముఖ్యమైన రోజు అని, ఆ రోజున రక్త దానం గురించి ఎంతో మందికి అవగాహన కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. యువతి యువకులు అందరూ రక్తదానం మీద ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.  చాలా మంది యువతీ యువకులకు రక్తదానం మీద అవగాహన లేకపోవడం, కొన్ని అపోహలు ఉండడం వల్ల రక్తదానం చేసేందుకు వెనుకాడుతున్నారన్నారు. అటువంటి అపోహలను విడనాడి రక్తదానం చేసి రక్తదాతలుగా ఉండటంతో పాటు ఇతరులకు జీవితాన్ని ఇచ్చిన వారు కూడా అవుతారని కలెక్టర్ పేర్కొన్నారు. రక్తదానం చేయాలని కొంతమంది యువతి యువకులకు ఆసక్తి  ఉన్నప్పటికీ ఎక్కడ ఇవ్వాలో  తెలియక రక్తదానం చేయలేకపోతున్నారని, కర్నూలు నగరంలో  చూసుకుంటే రెడ్ క్రాస్, ఏదైనా పెద్ద హాస్పిటల్స్ లో రక్తదానం ఇవ్వచ్చు అనే విషయం తెలిసి ఉంటుంది కానీ మారుమూల ప్రాంతాల్లో సదరు అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ రక్తదాన శిబిరాలు తీసుకొని వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.. రక్తదానం చేయడం వల్ల మనిషి ప్రాణాన్ని కాపాడడంతో పాటు ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళమవుతామనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు.రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు.. భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 కోట్ల బ్లడ్ బ్యాగ్‌లు అవసరం ఉంటే కేవలం 3.5 కోట్ల బ్లడ్ బ్యాగ్‌లను మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, అవసరమైన వారందరికీ రక్తాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని ఇది భారతదేశం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల లక్ష్యమన్నారు.అనంతరం రక్తదాన కార్యక్రమానికి ప్రోత్సహించిన వారికి కలెక్టర్ మెమెంటోలు అందచేశారు.  కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.ప్రవీణ్ కుమార్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, అదనపు డిఎంహెచ్వో డా.భాస్కర్,  రెడ్ క్రాస్ సొసైటీ కర్నూల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి,మాజీ చైర్మన్ శ్రీనివాసులు,కమిటీ మెంబర్లు,శ్రీమతి అరుణ,మధుసూదన,ప్రభాకర్ రెడ్డి,నరసింహ,భీమా శంకర్ రెడ్డి, ఎం జె.బాబురాజు,కె.వి సుబ్బారెడ్డి,శ్రీమతి మీనాక్షి,సెక్రటరీ వెంకట కృష్ణుడు,మెడికల్ ఆఫీసర్లు కుమారస్వామి రెడ్డి,రామచంద్రరావు,డిస్ట్రిక్ట్  కో ఆర్డినేటర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author