NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జీజీహెచ్​లో…   ప్రపంచ రక్తదాన దినోత్సవం

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  మాట్లాడుతూ

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసుపత్రి ఆవరణ నుండి రాజ్ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, ధన్వంతరి హల్ లో వివిధ సొసైటీ వారు ఎంతో మందికి రక్తదానం చేసిన వారికి మెమొంటో మరియు శాలువాతో సత్కరించి వారు చేస్తున్న సేవలను కొనియాడారు.రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు అనంతరం  రక్తదానం చేస్తే ఎంతో మందికి ప్రాణదానం చేసినట్లు అవుతుందని అని అన్నారు. “ప్రపంచ రక్తదాతల దినోత్సవం” సందర్భంగా.. రక్తదానాన్ని ప్రోత్సహించండి. ఆపదలో, అత్యవసర శస్త్రచికిత్సల్లో వున్నవారి కోసం ప్రాణదాత కాండీ అని అన్నారు. కర్నూల్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డాక్టర్ చిట్టి నరసమ్మ  మాట్లాడుతూ:-  ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మంది రక్తం లేక చనిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా తమ రక్తాన్ని బ్లడ్ బ్యాంకుల్లో దానం చేయాలని దీని వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవని అన్నారు.రక్తదానం  ప్రాణదానంతో సమానమని అని అన్నారు.ఈ కార్యక్రమానికి ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్, సింధు సుబ్రహ్మణ్యం, అడిషనల్ డీఎంహెచ్ఓ, మరియు లెప్రసి టీబి మెడికల్ ఆఫీసర్, డా.భాస్కర్ రాజు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.కిరణ్ కుమార్, బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్, డా.రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author