తల సేమియా బాధితులకు రక్తదానం ఎంతో అవసరం
1 min read– భోజన సదుపాయం ఏర్పాటు చేసిన డాక్టర్ వి ఎస్ ఆర్ ప్రసాద్ కు కృతజ్ఞతలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రభుత్వ బోధనా ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో ఎనిమిది మంది తలసీమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బి.వి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడికి నెలకు 150 నుంచి 200 యూనిట్ల రక్తం అవసరం అవుతుందని, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు విద్యార్థులు, ఉద్యోగస్తులు సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా రక్తదాతల కొరత ఉంటుందని అన్నారు, కాబట్టి ప్రతి ఒక్కరు రక్తదానంపై అవగాహన కలిగి స్వచ్ఛందంగా రక్తదానం చేసి తలసీమియా చిన్నారులను ఆదుకోవాలని కోరారు. తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు ఉచిత భోజనం ఏర్పాటుచేసిన దాత వి ఎస్ ఆర్ ప్రసాద్ కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కె వరప్రసాదరావు, వి ఎస్ ఆర్ ప్రసాద్ మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.