రాయచోటిలో విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ ఆధ్వర్యంలో లయన్ హనుమంత్ రెడ్డి గారి సౌజన్యంతో స్థానిక శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో 245 మంది విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు లయన్ చాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ రక్త నమూనాలు తెలుసుకొని అత్యవసర పరిస్థితులలో రక్తం ఇవ్వటానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. ప్రస్తుతం చాలా మంది రక్తం దొరకక మరణిస్తున్నారని, రక్త దానం చేసినట్లయితే ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపడవచ్చని తెలిపారు. అనంతరం రిజినల్ కోఆర్డినేటర్ లయన్ హరినాధ్ రెడ్డి మాట్లాడుతూ అపోహలు లేకుండా 18 సంవత్సరాలు దాటి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒక్కసారి రక్త దానం చేయవచ్చన్నారు. తాను 14 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం ఇచ్చినట్లు పేర్కొన్ను. అనంతరం కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సేవలో ఎల్లప్పుడూ ఉండే లయన్స్ క్లబ్ ఆఫ్ రాయచోటి టౌన్ వారు మేము అడిగిన వెంటనే ఇక్కడున్న మా విద్యార్థులకు రక్త నమూనా పరీక్షలు నిర్వహించినందుకు మా కళాశాల సిబ్బంది తరుపున ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు లయన్ హరీష్ చంద్ర, కార్యదర్శి లయన్ ఇందాద్ అహమ్మద్, ప్రిన్సిపాల్ బాలాజీ,N.S.S ప్రోగ్రామ్ ఆఫీసర్ కరుణాకర్,మురళి, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.