13 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి..
1 min readచైర్మన్ బివి కృష్ణారెడ్డి
దాతల సహకారంతో అన్నదానం చేసిన ఆర్.ఎస్.ఆర్.కె డా:వరప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 13 మంది తలసీమియా చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించామని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల సేమియా వ్యాధి చిన్నారులకు క్రమం తప్పకుండా రెండు నుంచి మూడుసార్లు రక్తమార్పిడి చేయించుకోవలసి ఉంటుందని, కాబట్టి రక్త దాతలు స్పందించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. మధ్యాహ్నం తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 35 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాతలు కొమ్మన బాలగంగాధర్ తిలక్ మరియు ద్రోణపల్లి వెంకట సుబ్బారావు లకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, రెడ్ క్రాస్ గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు, మానవత సభ్యురాలు భారతి, రత్నాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.