14 మంది తల సేమియ చిన్నారులకు రక్త మార్పిడి..
1 min read– రక్తదాతల సహకారంతోనే చిన్నారులకు రక్తమార్పిడి..
– చైర్మన్ బి వి కృష్ణారెడ్డి.. ఉచిత భోజనం, పండ్లు పంపిణీ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 14 మంది తల సేమియా వ్యాధి చిన్నారులకు రక్తమార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్డి క్రాస్ చైర్మన్ బివి కృష్ణారెడ్డి తెలిపారు.ఈరోజు అనేకమంది ప్రజలు రకరకాల రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వారందరూ కూడా రక్తమార్పిడిని చేయించుకుంటున్నారంటే దానికి ప్రధాన కారణం రక్తదాతల సహకారమేనని అన్నారు. ఈరోజు తలసీమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 35 మందికి జిల్లా మానవత విద్య కమిటీ చైర్మన్ ఆలపాటి నాగేశ్వరరావు ఉచిత భోజనం ఏర్పాటు చేశారన్నారు. అనంతరం చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్ని, డాక్టర్ ఆర్ఎస్ఆర్కె వర్ ప్రసాద రావు, ఆలపాటి నాగేశ్వరరావు, బి ఆర్ సి హెచ్ నారాయణ, కడియాల కృష్ణారావు, రేవూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.