PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

14 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి..

1 min read

ఏడాదికి 1,300 రెడ్ క్రాస్ యూనిట్ ల ద్వారా ఉచిత రక్త మార్పిడిలు..

చైర్మన్ బి వి కృష్ణారెడ్డి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు :  ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్ క్రాస్ తల సేమియా భవనంలో 14 మంది తల సేమియా చిన్నారులకు రక్తమార్పిడి నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ సుమారు 200 మంది తల సేమియా వ్యాధి పిల్లలు, 120 మంది సికిల్ సెల్ అనీమియా వ్యాధి పిల్లలు రెడ్ క్రాస్ భవనంలో నమోదు కాబట్టారని అన్నారు. వీరందరికీ రక్తమార్పిడికి సంవత్సరానికి 1200 నుంచి 1300 బ్లడ్ యూనిట్లను రెడ్ క్రాస్ ఉచితంగా సరఫరా చేస్తోందని  అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 35 మందికి ఉచిత భోజనం ఏర్పాటుచేసిన ఎన్.ఆర్.ఐ చాగర్లమూడి రాజ్ కుమార్ కి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి కేబీ సీతారాం, డాక్టర్ ఆర్ ఎస్ ఆర్ కే వరప్రసాదరావు, ఏలూరు మానవత చైర్మన్ మేతర అజయ్ బాబు, గౌరవ కార్యదర్శి కడియాల కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

About Author