NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘పంచ్ ప్రభాక‌ర్ ’ కు బ్లూ నోటీసు.. ఇంట‌ర్ పోల్ ద్వార నోటీసు

1 min read

పల్లెవెలుగు వెబ్​ : న్యాయమూర్తుల‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పంచ్ ప్రభాక‌ర్ అరెస్ట్ కు సీబీఐ బ్లూ నోటీసులు పంపింది. ఇంట‌ర్ పోల్ ద్వార ఈ నోటీసు పంపింది. పంచ్ ప్రభాక‌ర్ యూట్యూబ్ చానెల్ బ్లాక్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మ‌రో ఇద్దరు విదేశాల్లో ఉంటున్నందున వారంద‌ర్నీ అరెస్టు చేసేందుకు సంబంధిత న్యాయ‌స్థానాల నుంచి వారెంటు తీసుకుంది. ఇందుకోసం దౌత్య మార్గాల ద్వార సీబీఐ త‌మ ప్రయ‌త్నం ముమ్మరం చేసింది. కేసు ద‌ర్యాప్తులో భాగంగా 53 మొబైల్ నెంబ‌ర్ల కాల్ డీటైల్స్ రికార్డు సేక‌రించిన‌ట్టు సీబీఐ తెలిపింది. కేసు న‌మోదు చేశాక చాలా మంది త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల నుంచి పోస్టులు డిలీట్ చేసినందున.. డిజిట‌ల్ ఫోరెన్సిక్ టెక్నాల‌జీ ద్వార ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డింది.

About Author