NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బోర్డు తిప్పేసిన సాఫ్ట్ వేర్ సంస్థ‌.. రోడ్డునప‌డ్డ 800 ఉద్యోగులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఈ దెబ్బతో 800 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగింది. మాదాపూర్‌లోని ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ సాఫ్ట్‌వేర్‌ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షలు వసూలు చేసింది. సుమారు 20 కోట్లు వరకు నిరుద్యోగుల నుంచి వసూలు చేసి వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ కూడా ఇచ్చి జీతాలు ఇచ్చారు. అయితే అకస్మాత్తుగా రెండు వారాల క్రితం కంపెనీ వెబ్సైట్,మెయిల్స్ బ్లాక్ చేసింది ఇన్నోహబ్‌ టెక్నాలజీస్‌ సంస్థ. దీంతో షాకైన ఉద్యోగులు సమాచారం ఆరా తీసేందేకు ప్రయత్నించగా సంస్థకు సంబంధించి ఉద్యోగులు,బోర్డ్ లేకపోవడంతో తాము మోసపోయినట్లు తెలుసుకున్నారు. దీనిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో బాధిత ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి వారం గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ సోమవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ ముందు బాధిత ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.

                            

About Author