NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బోగ‌స్ చ‌లానాలు.. ముగ్గురు స‌బ్ రిజిస్ట్రార్లు సస్పెండ్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బోగ‌స్ చ‌లానాల కుంభ‌కోణంపై రాష్ట్ర ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంది. క‌డ‌ప అర్బన్ స‌బ్ రిజిస్ట్రార్లు చంద్రమోహ‌న్, సుబ్బారెడ్డి, రూర‌ల్ స‌బ్ రిజిస్ట్రార్ హ‌రికృష్ణ తో పాటు అసిస్టెంట్ ర‌త్నమ్మ, సుకుమార్ ల‌ను స‌స్పెండ్ చేస్తూ ఆ శాఖ డీఐజీ గిరిబాబు శ‌నివారం ఉత్తర్వులు జారీ చేశారు. న‌కిలీ చ‌లానాల కేసులో ఐదుగురు సస్పండ్ కావ‌డంతో రిజిస్ట్రేష‌న్ల శాఖ‌లో క‌ల‌క‌లం రేగింది. ఇప్పటి వ‌ర‌కు ప్రభుత్వానికి అందాల్సిన 1.08 కోట్ల రూపాయాల‌ను దిగ‌మింగార‌ని ప్రాథ‌మికంగా నిర్ధార‌ణ అయింది. విచార‌ణ పూర్తయితే ఇంకెంత స్వాహా చేశార‌న్న విష‌యం కూడ బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఐదుగురి స‌స్పెన్షన్ వాస్తవ‌మేన‌ని, విచార‌ణ కొన‌సాగుతోంద‌ని జాయింట్ క‌లెక్టర్ గౌత‌మి తెలిపారు.

About Author