హిజాబ్ పై బాలీవుడ్ స్పందన
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం పై పలువురు బాలీవుడ్ తారలు స్పందించారు. బాలీవుడ్ నటి రిచా చద్దా ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘‘ఒంటరి యువతిపై కొందరు యువకులు దాడికి పాల్పడుతూ దాన్ని గర్వంగా ఫీలవుతున్నారు. ఇది సిగ్గుమాలిన చర్య. ఈ యువకులను వారి తల్లిదండ్రులు సరిగ్గా పెంచలేదు. వారి పెంపకంలో లోపం ఉంది. భవిష్యత్తులో ఆ యువకులకు ఉపాధి దొరకదు. ఫలితంగా వారి చేతుల్లో చిల్లిగవ్వ కూడా ఉండదు. ఇలాంటి వారిపై అస్సలు దయ చూపకండి’’ అని రిచా చద్దా పోస్ట్ పెట్టింది. ముక్కు సూటిగా మాట్లాడే స్వర భాస్కర్ కూడా హిజాబ్ వివాదంపై కామెంట్ చేసింది. ‘‘జాతివివక్షత మళ్లీ వచ్చినట్టు అనిపించింది ’’ అని స్వర భాస్కర్ స్పందించింది.