PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌మ్మూ ఎయిర్ పోర్ట్ లో బాంబు పేలుళ్లు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : జ‌మ్ము ఎయిర్ పోర్టులో వ‌రుస బాంబు పేలుళ్లు క‌ల‌క‌లం రేపాయి. ఐదు నిమిషాల వ్యవ‌ధిలో రెండు పేలుళ్లు సంభ‌వించిన‌ట్టు భార‌త వైమానిక ద‌ళ అధికారులు తెలిపారు. వేకువఝామున రెండు గంట‌ల స‌మ‌యంలో పేలుళ్లు సంభ‌వించాయి. పేలుళ్ల ధాటికి విమానాశ్రయంలో ఓ భ‌వ‌నం పై క‌ప్పు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని, విష‌యం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘ‌ట‌నాస్థలికి చేరుకుని త‌నిఖీలు నిర్వహించారు. జ‌మ్మూ కశ్మీర్ ర‌న్ వే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవ‌స్థ ఐఏఎఫ్ నియంత్రణలో ఉన్నాయ‌ని అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న పై విచార‌ణ కొన‌సాగుతోంది.

About Author