బాంబులతో దద్దరిల్లిన బెంగాల్
1 min readపల్లెవెలుగు వెబ్: పశ్చిమ బెంగాల్ నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికల్లో బాంబుల మోత మోగింది. పోలీసుల కాల్పులతో దద్దరిల్లింది. కూచ్బెహర్ ప్రాంతంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన గొడవ పోలీసు కాల్పులకు దారితీసింది. సీతల్ కుచి ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి బీజేపీ పోలింగ్ ఏజెంట్ అని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరుపార్టీలు ఘర్షణకు దిగాయి. ఒకరి మీద మరొకరు బాంబులతో దాడులకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసినా.. పరిస్థితి సద్దుమణగలేదు. దీంతో పోలీసులు ఆందోళనకారుల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు.