NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. అమితాబ్ ఇంటితో పాటు మ‌రో మూడు ప్రధాన రైల్వే స్టేష‌న్ ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. దీంతో అప్రమ‌త్తమైన పోలీసులు అమితాబ్ ఇంటి వ‌ద్ద, రైల్వే స్టేష‌న్లలో భ‌ద్రత పెంచి విస్త్రత త‌నిఖీలు చేప‌ట్టారు. అయితే .. అది న‌కిలీ బెదిరింపు కాల్ అని తేల‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబ‌యి పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియ‌ని వ్యక్తి నుంచి శుక్రవారం కాల్ వ‌చ్చింది. చ‌త్రప‌తి శివాజీ మ‌హ‌రాజ్ ట‌ర్మిన‌స్, బైకుల్లా, దాద‌ర్ రైల్వే స్టేష‌న్లు తో పాటు అమితాబ్ ఇంటి వ‌ద్ద బాంబులు పెట్టిన‌ట్టు ఆగంత‌కుడు స‌మాచార‌మిచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్ త‌నిఖీల‌తో పాటు, జాగిలాల‌తో విస్త్రత త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలు, అనుమాన‌స్పద వ‌స్తువులు ల‌భించ‌లేదు.

About Author