PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొమ్మల సత్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లను ను సస్పెండ్ చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: సక్రమంగా విధులకు హాజరు కాకుండా తన సొంత మెనూ నడుపుతూ విద్యార్థిలకు గుడ్లు అరటిపండు ఇవ్వకుండా కడుపు కొడుతున్న వార్డెన్ వెంకటేశ్వర్లు, బొమ్మలసత్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లు హాస్టల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనే అహంతో నన్ను ఎవరు ఏం చేసుకోలేరని చెప్తున్నా వార్డెన్ వెంకటేశ్వర్లువిద్యార్థుల కడుపు కొడుతున్న వార్డెన్ వెంకటేశ్వర్లను అలాగే అతనికి సపోర్ట్ చేస్తున్న జిల్లా డిడి చింతామణి గారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోరిన పీ డీ ఎస్ యూ నేతలు, విద్యార్థుల సమస్యలు గాలికి వదిలేసి సక్రమంగా విధులకు హాజరు కాకుండా విద్యార్థులు కడుపు కొడుతున్న బొమ్మల సత్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు రాంబాబు డిమాండ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం బొమ్మల సత్రంలోని ఎస్సీ హాస్టల్ ను ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మల సత్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వర్లు గారు సక్రమంగా విధులకు హాజరుకాకుండా విద్యార్థులకు పెట్టవలసిన మెనూను తారుమారు చేసి తన సొంత మెనూ ఏర్పాటు చేసి విద్యార్థులు కడుపు కొడుతున్నారని తక్షణమే జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అయనను సస్పెండ్ చేయాలని మేము తెలియజేస్తున్నాం అలాగే అనేకమార్లు అయినపై ఫిర్యాదు చేసిన కూడా ఇంతవరకు జిల్లా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనక రహస్యమేంటో చెప్పాలని మేము ప్రశ్నిస్తున్నాం స్వయంగా విద్యార్థులే మా సమస్యలను వార్డెన్ వెంకటేశ్వర్లు పట్టించుకోవడం లేదు అని మెనూ ప్రకారం మాకి ఆహారం పెట్టడం లేదని గుడ్లు అరటి పండ్లు ఇవ్వడం లేదని స్వయంగా విద్యార్థులు చెబుతున్న కూడా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు మాత్రం అయన ఇచ్చిన ముడుపులకు ఆశపడి అతనిపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం సిగ్గుమాలిన చర్య హాస్టల్ లో ఇన్ని సమస్యలు ఉన్న కూడా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు మాత్రం అక్కడ ఏమి సమస్యలు లేవు అని ఉన్నతధికారులకు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ చెప్పాలి. ఈయనపై చర్యలు తీసుకోవాలని అనేక ఉద్యమాలు చేసిన జిల్లా సంక్షేమ శాఖ అధికారి చింతామణి గారు ఇతనిని సపోర్ట్ చేస్తూ అతను ఇచ్చే కాసుల కక్కుర్తి పడి చర్యలు తీసుకోవడం లేదు అలాగే ఈయనకు బీసీ ప్రీ మెట్రిక్ హాస్టల్ మరియు ఎస్టీ హాస్టల్ ఇంచార్జి ఇవ్వడం ఎంతవరకు కరెక్టో చెప్పాలాని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈయనను సస్పెండ్ చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారులను కోరుతున్నాం లేని పక్షంలో జిల్లా డిడి కార్యాలయం ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం ఆధారాలతో సహా ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని ఏ వార్డెన్ అయిన విద్యార్థుల కడుపు కొడితే సహించేది లేదని హెచ్చరిస్తున్నాం.

About Author