బొందిలి కులస్తులకు అండగా ఉంటా… టి.జి భరత్
1 min readకార్తీక మాస వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న టి.జి భరత్
పల్లెవెలుగె వెబ్ కర్నూలు: బొందిలి కులస్తులకు తాను అండగా ఉంటానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని రాజ్ విహార్ సమీపంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కర్నూలు జిల్లా రాజ్ పుత్ ( బొందిలి ) సంఘం, రాజ్ పుత్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నాను. ఈ సందర్భంగా రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు. రాజ్ పుత్ సంఘం ఆధ్వర్యంలో అందరూ కలిసి కట్టుగా వనభోజన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషించే విషయమన్నారు. ఇదే స్పూర్తితో మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు కూడా అందరూ ముందుకు రావాలన్నారు. ఇక రాజ్ పుత్ సంఘం పెద్దల కోర్కె మేరకు కర్నూల్లో రాణా ప్రతాప్ సింగ్ రాజు విగ్రహం ఏర్పాటు చేసేందుకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. తాను గెలిచి టిడిపి ప్రభుత్వం ఏర్పడితే శ్రీశైలంలో బొందిలి కులస్తుల కోసం సత్రంతో పాటు, కర్నూల్లో కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. వనభోజన కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా రాజ్ పుత్ సంఘం క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బొందిలి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. విక్రమ్ సింగ్, శంకర్ సింగ్, రఘు సింగ్, సాయి చరణ్, అభిమన్యు, క్రిష్ణ, గణేష్ సింగ్, శ్రీనివాస్, కిరణ్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.