పత్తికొండ శాఖ గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పత్తికొండ శాఖ గ్రంధాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ముందుగా పత్తికొండ శాఖ గ్రంధాలయంలో గ్రంథాలయ ఉద్యమకారులు గాడి చర్ల హరిసర్వోత్తమరావు, అయ్యంకి వెంకట రమణయ్య, ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటాలకు పూలమాలవేసి వారు గ్రంధాలయాలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. పత్తికొండ శాఖ గ్రంధాలయ అధికారి రాంకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను మండల అధ్యక్షులు నారాయణదాసు , మండల అభివృద్ధి అధికారిని కవిత మండల విద్యాధికారి మస్తాన్ వలి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రంథాలయాలను గతంలో మేధావులంతా ఉపయోగించుకొని గొప్పవారయ్యారని అన్నారు. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు గ్రంధాలయాలలో చదివిన వారే అని స్పష్టం చేశారు. గ్రంథాలయాలను మరింత అభివృద్ధి దిశగా తీసుకు రావడానికి తాము పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్రో పేట ప్రధానోపాధ్యాయులు కాసిం సాహెబ్ , ఉపాధ్యాయులు చిన్నారావు, గ్రంథాలయ పాటకులు మహేశ్వర్ రెడ్డి, ఉమామహేశ్వర్, నాగేంద్ర ,నారాయణ, సురేంద్ర అబ్దుల్లా , నాగరత్నమ్మ , పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.