NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈనెల 7న  ప్రభుత్వ జూనియర్ కళాశాల సావనీర్ పుస్తకావిష్కరణ 

1 min read

పూర్వ విద్యార్థులకు ఇవే మా ఆహ్వానం

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  రాష్ట్రంలోనే ఎంతో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన పత్తికొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈనెల 7వ తేదీన కళాశాల పురోగతిపై సావనీర్ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుప తల పెట్టామని కళాశాల పూర్వ విద్యార్థి ఆర్గనైజర్స్  వీరేశప్ప, అడ్వకేట్ సురేష్, సాయిబాబా, రామ్మోహన్ తెలిపారు. గురువారం కళాశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సంఘము ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న పైలాన్ ను వారు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, కళాశాల పూర్వ విద్యార్థుల  ఆధ్వర్యంలో  గత సంవత్సరం 2022 డిసెంబర్ నెలలో  వైభవంగా గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. పూర్వ విద్యార్థుల తరపున కళాశాల ఆవరణలో పైలాన్ పనులు పూర్తయ్యాయని, ఈనెల 7వ తేదీ పైలాన్ను ప్రారంభించడం జరుగుతుందని, అలాగే  కళాశాల ప్రగతికి సంబంధించిన ఒక సావనీర్ పుస్తకం ముద్రించామని, సావనీరు పుస్తకం ఈనెల 7వ తేదీ ఆవిష్కరించబడుతుందని వివరించారు. కావున కళాశాల ప్రతి ఒక్క పూర్వ విద్యార్థి ఈనెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు  పైలాన్, సావనీర్  పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

About Author