గో సేవకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గుర్తింపు
1 min readపల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : అనంతపురం కు చెందిన ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ నిర్వాహకురాలు కౌసల్య కొంతమందితో కలిసి చేస్తున్న గో సేవకు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ప్రశంస పత్రాలతో పాటు శాలువా పూలమాలలు వేసే అభినందించారు .అనంతపురం కు చెందిన ఓం సంగీత నృత్య కోలాట శిక్షణ సంస్థ నిర్వాహకురాలు దేవరకొండ కౌసల్య 45 మందితో శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆమె సేవలకు మెచ్చి బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ఆమెను అభినందించి ప్రశంసించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రస్తుత సమాజంలో పిల్లలకు ఉదయం నిద్ర లేవగానే ఏ శ్లోకంతో నిద్రలేవాలి. పడుకునేంతవరకు ఏ శ్లోకాలు పటించాలి .వినయానికి బానిసత్వానికి తేడా తెలియచేయడం తల్లిదండ్రులను గురువులను సమాజం పట్ల పెద్దల పట్ల ఎలా గౌరవంగా ప్రవర్తించాలి అనేదానిపై విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి బోధిస్తున్నారు .అలాగే సమాజంలో గో సేవ చేయడం అంటే రోడ్డు పక్కన ఉన్న ఆవులకు గడ్డి పెట్టి సేవ చేయడం గోవులను కాపాడడం మనందరి బాధ్యత అని ఆమె అన్నారు. గో సేవలో ఈమె సేవలకు మెచ్చి ఈగల్ రైట్స్ సంస్థ సభ్యురాలు రాజ్యలక్ష్మి ఈగల్ రైడ్స్ లో స్టేట్ జాయింట్ సెక్రెటరీ పదవి కూడా ఇచ్చి అభినందించారు దేవరకొండ కౌసల్య చేస్తున్న సేవలకు పలు సంస్థలు ఆమెను అభినందించి ప్రశంస పత్రాలు అందజేశారు. దేవరకొండ కౌసల్య తమ సంస్థ సభ్యులతో మంత్రాలయంకు వచ్చారు మంత్రాలయంలో శ్రీ మఠం ప్రకారం లో కోలాటలు వేసి ఉభక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో రాగిణి ఆనందమ్మ చంద్రకళ చరిత శ్రీ శర్వాణి పద్మ శైలజ మంజుల శాంతి చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.