PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికలు సమీపిస్తున్నాయి.. గ్రామాలలో ఉన్న బూత్ కన్వీనర్లు యాక్టివ్ అవ్వాలి

1 min read

వై.నాగేశ్వరరావు యాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం డోన్ లోని పాత కృష్ణవేణి టాలెంట్ స్కూలు నందు డోన్ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ లో తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్ ,తెలుగుదేశం పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్చార్జి సుబ్బారెడ్డి , డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ కాటమయ్య , మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర ,రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళి గౌడ్ ,నంద్యాల బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ , బీసీ సెల్ అధ్యక్షులు మల్లికార్జున , శీనయ్య ,రాము ,డోన్,ప్యాపిలి,బేతంచెర్ల మండలం అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జిలు,యూనిటీ ఇన్చార్జులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు గ్రామ నాయకులు, సోషల్ మీడియా నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు యాదవ్ గారు మాట్లాడుతూ:
ఎన్నికలు సమీపిస్తున్న వేళలో గ్రామాలలోని ప్రతి బూత్ కన్వీనర్లు యాక్టివ్ అవ్వాలి.క్లస్టర్, యూనిట్ ఇంచార్జులు మరియు బూత్ ఇంచార్జులు శిక్షణ ప్రకారం వారి పరిధిలో గల బూత్ లను ఓటర్ వెరిఫికేషన్ & హౌస్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలి.గ్రామాలలోని తప్పుడు ఓట్లను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓట్లను తొలగించకుండా ఎప్పటికప్పుడు ఓటర్ లిస్టును చెక్ చేస్తూ ఉండాలి.సోషల్ మీడియాను ఉపయోగించుకొని ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకతను తెలియజేయాలి.మొన్న జరిగిన సంఘటన కరుడుగట్టిన వైసిపి నాయకుడు కడప జిల్లా వాసి అన్విత్ కృష్ణారెడ్డి. వైసీపీ సోషల్ మీడియా భార్గవ్ రెడ్డి గారికి ప్రధాన అనుచరుడు. అన్విత్ కృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బ్యాక్ గ్రౌండ్ లో చంద్రబాబు నాయుడు గారి ఫోటోను ఉంచి,మెడలో కండువా వేసుకుని దళితులను,మహిళలను,బీసీలను తిడతా ఉంటాడు ఎందుకంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారి చేపిస్తున్నారు అని, అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి దూరం కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నాడు.వైసీపీ నాయకులు,సోషల్ మీడియా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముకగా నిలిచారు బీసీలను దూరం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే కొంతమంది తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని మా బీసీలను తిట్టడం మొదలుపెట్టి అదిదేదో తెలుగుదేశం పార్టీ చేస్తున్న విధంగా వక్రికరించి పన్నాగం పన్నారు.పార్టీ పెద్దలు,రాష్ట్ర నాయకులు అంత సిఐడి విభాగంలో కంప్లైంట్ చేయడం జరిగినది. మేము కూడా వారిపై నిన్న మానవ హక్కుల కమిషన్ లో కంప్లైంట్ చేయడం జరిగినది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వాలి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ అందిస్తూ ఉండాలి.

About Author