PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బూత్ లెవెల్ అధికారులు కచ్చితంగా ఇంటింటికీ వెళ్ళాలి 

1 min read

– ఓటర్ల పరిశీలనలో తప్పులు జరగకూడదు

– టెలి కాన్ఫరెన్స్ లో ఈ ఆర్వో  లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: బూత్ లెవెల్ అధికారులు కచ్చితంగా ఇంటింటికీ వెళ్ళాలని, ఓటర్ల పరిశీలనలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డా జి.సృజన టెలికాన్ఫరెన్స్ లో ఈ ఆర్వో  లను ఆదేశించారు.గురువారం ఉదయం   ఈ ఆర్వో లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు, తహశీల్దార్లు, ఎంపీడీఓ లు తదితరులతో ఎన్నికలు, జగనన్న కి చెబుదాం తదితర అంశాలపై కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  బూత్ స్థాయి అధికారులు  ఇంటింటి సర్వే కి వెళ్లకుండా, వారి వద్ద  ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా ప్రకారమే చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అలా జరగకుండా చూసుకోవాలని ఈ ఆర్వో లను ఆదేశించారు.. ముఖ్యంగా  అర్బన్ ప్రాంతాల్లో ఇలాంటివి జరుగుతున్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు తన  దృష్టికి తెచ్చారన్నారు.. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మునిసిపల్ కమిషనర్లు, ఈ ఆర్వో లు ఈ అంశంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు..ప్రజలలో ఎటువంటి అభద్రత భావం కలగకూడదని,  బూత్ లెవెల్ అధికారులు  కచ్చితంగా ఇంటింటికి వెళ్లి, లొకేషన్ క్యాప్చర్ చేసుకొని, ఆన్లైన్ లో అప్డేట్ చేయాలన్నారు…. మార్పులు, చేర్పులు ఏమి  జరిగినా ప్రజలకు తెలిసే జరుగుతాయనే నమ్మకాన్ని ప్రజలలో కలిగించే బాధ్యత మనందరిపై ఉందని  కలెక్టర్ తెలిపారు. ఇంటింటి సర్వే జరుగుతుందనే అంశాన్ని కూడా   పబ్లిసిటీ చేయించాలని ,అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.. అదే విధంగా అనామిలీస్, క్లైమ్స్, అబ్జెక్షన్స్ కు సంబంధించిన వివరాలను  మినిట్స్ రూపంలో రూపొందించి నిర్దేశించిన ఫార్మాట్ లో సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులకు కచ్చితంగా  ఇవ్వాలన్నారు…ఎన్నికల విధులను మొక్కుబడిగా కాకుండా సీరియస్ గా తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. ఆ మేరకు ఈ, ఏ ఈ ఆర్ ఓ లు, బిఎల్వోలు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు..వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న ఈ కేవైసీ ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఎంపిడివో లను ఆదేశించారు.. ప్రాధాన్యతా భవనాల పురోగతిపై పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీర్ల తో సమీక్షిస్తూ, రోజు వారీ నిర్దేశించిన లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం చేయకూడదని, కచ్చితంగా ప్రోగ్రెస్ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో  పంచాయతీరాజ్ ఎస్ ఈ సుబ్రహ్మణ్యం,  జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author