విసుగొచ్చిందని.. రూ. 3.5 కోట్ల జీతం వదలుకున్నాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికాకు చెందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో 2017 నుంచి పని చేస్తున్నాడు మైఖెల్ లిన్. ఏడాదికి మూడున్నర కోట్ల రూపాయల జీతం. అక్కడ తనకంటూ ఒక టీమ్. తగిన గౌరవం ఉంది. అయితే కరోనా సమయంలో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆ సమయంలో మైఖెల్ మరియు అతని టీం. వీక్షకులను ఆకట్టుకునేలా కష్టపడి పని చేశారు. ఆ సమయంలోనే రోజూ కొత్త కొత్త ఛాలెంజ్‌లను స్వీకరించాడు. కష్టపడి పని చేశాడు. ఆ తర్వాత లాక్డౌన్ ముగిసింది. పని రోటీన్ అయింది. రోజూ చేసే పని చేసి బోర్ కొట్టింది. అంతే. చేసిన పనే చేసీ చేసీ విసుగొచ్చేసిందని నెట్‌ఫ్లిక్స్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు మైఖెల్ లిన్.