ఐటీ ఫలితాలతో బేజారు.. తగ్గిన బుల్ జోరు
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం ఆరంభంతోనే నష్టాలతో మొదలెట్టాయి. షాంగైలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న లాక్డౌన్, మార్చిలో దేశీయంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, అంచనాలను అందుకోలేకపోయిన ఐటీ కంపెనీల పనితీరు, ప్రతికూలంగా కదలాడుతున్న అంతర్జాతీయ మార్కెట్ సూచీలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. సెన్సెక్స్ 1172 పాయింట్ల నష్టంతో 57166 వద్ద, నిఫ్టీ 302 పాయింట్ల నష్టంతో 17173 వద్ద ముగిసింది.