విగ్రహ ప్రతిష్టలో ఇరు పార్టీల నేతలు బైరెడ్డి,గౌరు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ఇరు పార్టీల నాయకులు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరియు నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ గౌరు వెంకటరెడ్డి వేరు వేరుగా హాజరై స్వామివారి సేవలో తరించారు. శ్రీ విద్యా సుందర సరస్వతి పీఠము యశోదర కుమార శర్మ ఆధ్వర్యంలో జరిగాయి. శుక్రవారం ఉదయం 8:30 కు సిద్ధార్థ రెడ్డి హాజరై ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సుంకేసుల శ్రీరామ దత్తాశ్రమము జూలకంటి మల్లికార్జున రావు హాజరయ్యారు.స్వామివారికి టెంకాయలు కొడుతూ నాయకులు మరియు గ్రామాల ప్రజలు పూజలు నిర్వహించారు.సిద్ధార్థ రెడ్డి వెంట గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు,ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,తువ్వా లోకేశ్వర రెడ్డి,సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,చిన్న మల్లారెడ్డి,మల్లు శివ నాగిరెడ్డి,మల్లు వెంకటేశ్వర రెడ్డి,సత్యం రెడ్డి,వడ్డెర సంఘం జిల్లా నాయకులు చక్రి మరియు వివిధ గ్రామాల నాయకులు ఆయన వెంట ఉన్నారు.11 గంటలకు గౌరు వెంకటరెడ్డి టిడిపి మండల కన్వీనర్ కాత రమేష్ రెడ్డి,వంగాల శివరామిరెడ్డి,వంగాల జగన్మోహన్ రెడ్డి,రమణారెడ్డి, మరియు రైతు సంఘం నాయకులు వంగాల సిద్ధారెడ్డి వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు.