అమలాపురం అల్లర్ల పై బొత్స సంచలన వ్యాఖ్యలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : అమలాపురంలో అల్లర్ల పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. “ అమలాపురం అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర ఉంది. అల్లర్ల వెనుక ఎవరున్నారో వెలికితీస్తామని’’ మంత్రి బొత్స అన్నారు. పవన్‌కల్యాణ్ అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. తుని ఘటనపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రతిపక్షాలు కోరలేదా? ప్రభుత్వంపై కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోమని’’ మంత్రి బొత్స హెచ్చరించారు.