బాక్సింగ్ రింగ్ వద్ద బాక్సర్ నిరసన.. వింత ఘటన !
1 min read
పల్లెవెలుగు వెబ్: టోక్యో ఒలంపిక్స్ లో వింత ఘటన చోటుచేసుకుంది. హెవీ వెయిట్ బాక్సింగ్ విభాగంలో ఫ్రాన్స్ బాక్సర్ మౌరాద్ అలీవ్ బాక్సింగ్ రింగ్ పై నిరసన తెలిపాడు. ఆదివారం ఉదయం బ్రిటిష్ బాక్సర్ ఫ్రేజర్ క్లర్క్ తో క్వార్టర్ ఫైనల్స్ లో తలపడిన సందర్బంగా మౌరాద్ అలీవ్ పై రిఫరీ అండీ ముస్టాచియో రెండో రౌండ్ లో అనర్హత వేటు వేశాడు. పలుమార్లు ప్రత్యర్థిని ఉద్దేశపూర్వకంగా తలతో కొట్టి గాయపరచడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో న్యాయనిర్ణేతలు ఈ మ్యాచ్ లో ఫ్రేజర్ క్లర్క్ ను విజేతగా ప్రకటించారు. దీనికి నిరసనగా బాక్సింగ్ రింగ్ వద్ద కూర్చుని మౌరాద్ అలీవ్ నిరసన తెలిపాడు.