PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాయ్ కాట్ `ఆదిపురుష్‌` !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’ విడుదల కావడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే విడుదలయింది. అయితే, ఈ ట్రైలర్ పై పలువురు పెదవి విరుస్తున్నారు. రామాయణంను ఒక రేంజ్ లో తీస్తారనుకుంటే… చివరకు గ్రాఫిక్స్ సినిమా తీశారేంటని విమర్శిస్తున్నారు. బొమ్మల సినిమాలా ఉందని అంటున్నారు. అంతేకాదు… రావణాసురుడు, హనుమంతుడు ఎలా ఉంటారో తెలియదా… వారిని అలా చూపిస్తారా? అని మండిపడుతున్నారు. అంతేకాదు… బ్యాన్ ఆదిపురుష్, బాయ్ కాట్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. హిందూ మతవిశ్వాసాలను దెబ్బతీయడం బాలీవుడ్ కు అలవాటయిందని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

                                  

About Author