బోయబొంతిరాళ్ల మాదన్న హత్య.. జగన్ అండతోనే : అచ్చెన్నాయుడు
1 min read
పల్లెవెలుగువెబ్: ఏపీలో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ అండతోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ గూండాల దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలు బోయబొంతిరాళ్లలో మాదన్న హత్యను ఖండిస్తున్నామని అన్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తమ కార్యకర్తల కుటుంబాల కన్నీళ్లకు కారణమైన వారిని వదలమని అచ్చెన్నాయుడు అన్నారు.