PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్ర‌హ్మాస్త్ర సినిమా బాయ్ కాట్ చేయండి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్‌కాట్ చేయాలని సోష‌ల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ట్రైలర్‌లోని ఒక సీన్ ఓ వర్గం వారి మనోభావాలను గాయపరిచేలా ఉంది. రణ్‌బీర్ కపూర్ షూస్ వేసుకుని గుడి లోపలికీ ప్రవేశిస్తారు. ఈ సీన్‌తో సోషల్ మీడియా యూజర్స్‌కు కోపం వచ్చింది. ఫలితంగా ‘బ్రహ్మాస్త్ర’ సినిమాను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీన్‌ను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. ‘‘అతడు షూస్ వేసుకుని ఎందుకు గుడి లోపలికి ప్రవేశిస్తున్నారు’’ అని ఆ నెటిజన్ ప్రశ్నించారు. ‘‘సనాతన ధర్మాన్ని పాటించేవారి మనోభావాలను గాయపరిచే అవకాశాన్ని బాలీవుడ్ ఎప్పుడు వదులుకోదు’’ అని మరో నెటిజన్ తెలిపారు. ‘‘రణబీర్ కపూర్ షూస్ వేసుకుని గుడి గంటలను మోగిస్తున్నారు. దక్షణాది పరిశ్రమ హిందూ సంస్కృతిని గౌరవిస్తుంది. బాలీవుడ్ మాత్రం అలా చేయదు.“ అంటూ ఓ నెటిజ‌న్ పోస్ట్ చేశారు.

                                             

About Author