PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘గడపగడపకు మన ప్రభుత్వం’ కు బ్రహ్మరథం

1 min read
  • ఎమ్మెల్యే, పి ,రవీంద్ర నాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​ : చెన్నూరు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో  భాగంగా సోమవారం మధ్యాహ్నం నుండి చెన్నూరు మైనార్టీ కాలనీలోని గ్రామ సచివాలయం -1 పరిధిలోని రెండో వార్డు, మూడో వార్డు లో   కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, కి , బాణసంచా కాలుస్తూ బ్యాండ్ వాయిద్యాలతో ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు  బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల టన్షన్ గా  పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, కొంత మంది తమకు రేషన్ కార్డు కాలేదని, మరికొంతమంది ఇంటి స్థలాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన స్పందించి వెంటనే అర్హులైన వారికి ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు, అంతేకాకుండా పోలీస్ స్టేషన్ పక్క వీధిలో త్రాగు నీటి బోరు రోడ్డుకు అడ్డంగా ఉందని వెంటనే బోరు ను మార్చు వలసిందిగా అక్కడి ప్రజలు మాజీ ఎంపిటిసి మునీర్ అహ్మద్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి బోరు ను మార్చు వలసిందిగా అధికారులకు సూచించారు… మండుటెండల్లో గడపగడపకు… మండుటెండ ల ను సైతం లెక్కచేయకుండా కమలాపురం శాసనసభ్యులు పి, రవీంద్ర నాథ్ రెడ్డి,, గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు  వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అక్కడికక్కడే ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ సి పి మండల కన్వీనర్ , జి ఎన్, భాస్కర్ రెడ్డి వైయస్సార్ సి పి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, వై ఎస్ ఆర్ సి పి కమలాపురం మైనార్టీ కన్వీనర్ అన్వర్ భాష, ఎంపీటీసీ దుంప నాగిరెడ్డి, జెడ్ పి టి సి ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సొసైటీ అధ్యక్షుడు ముది రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, ఎంపీటీసీ ముది రెడ్డి సుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్ , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గణేష్ రెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, , రఘురాం రెడ్డి, , అబ్దుల్ రబ్, మునీర్ అహ్మద్, హస్రత్, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author