8న ’బ్రాహ్మణ’ మహిళలకు ఘనసన్మానం
1 min readబ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి అధ్యక్షుడు సండేల్చంద్రశేఖర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈనెల 8న విద్యావంతులు, ఉద్యోగులు..స్వాతంత్ర పోరాట యోదులైన బ్రాహ్మణ మహిళలను ఘనంగా సన్మానించనున్నట్లు వెల్లడించారు బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి అధ్యక్షుడు సండేల్చంద్రశేఖర్. శుక్రవారం కర్నూలు నగరంలోని దేవి ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి, గాయత్రి బ్రాహ్మణ సంఘం సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సండే చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అన్నారు. సామాజికంగా.. ఆర్థికంగా.. రాజకీయంగా, ఉద్యోగపరంగా రాణిస్తూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచే బ్రాహ్మణ వీరవనితలను సగౌరవంగా సన్మానిస్తామని ఈ సందర్భంగా సండేల్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతరం గాయత్రి బ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు, పసుపుల గ్రామ ఎంపీటీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఝాన్సీలక్ష్మీభాయి, ఇందిరాగాంధీ, సరోజిని నాయుడు, ప్రతిభాపాటిల్ వంటి బ్రాహ్మణ వీరవనితలు.. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఈ నెల 8న (సాయంత్రం 5 గంటలకు) నగరంలోని నంద్యాల చెక్ పోస్టు దగ్గరున్న దేవి ఫంక్షన్ హాల్లో బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్రమండలి, గాయత్రి బ్రహ్మణ సంఘం నేతృత్వంలో బ్రాహ్మణ వీరవనితలను సన్మానిస్తామని, ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేయాలని పసుపుల ఎంపీటీసీ మురళీకృష్ణ కోరారు. సమావేశంలో గాయత్రి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కొలుకుల చంద్రశేఖర్, గాయత్రి బ్రాహ్మణ సంఘం సెక్రటరి కంచుగుంటల శ్యామ్ సుందర్ శర్మ, బ్రాహ్మణ సేవ సంక్షేమ మిత్ర మండలి కోశాధికారి నాగులవరం రాజశేఖర్, ఈసీ మెంబర్లు శ్రీనివాసరాజు, చల్లా నాగరాజు శర్మ, ఎ.రాధాకృష్ణ, సీఎస్ ప్రసాద్, ఆర్. సుధాకర్ తదితరులు ఉన్నారు.