బ్రాహ్మణులను టార్గెట్ గా చేసుకొని హత్యలు..
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందు బ్రాహ్మణ పురోహితులపై దాడులపై హత్యలపై రాష్ట్ర ప్రభుత్వము ఈ సంఘటనలపై చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించిన బాధితులను కఠినంగా శిక్షించాలని AP బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య బ్రాహ్మణ అన్య క్రాంతుల ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్ సముద్రాల హనుమంతరావు డిమాండ్ చేయడం జరిగింది నిన్న జరిగిన సంఘటనలో మడకశిర మండలం హేమావతి గ్రామం మరియు 24 గ్రామాలకు చుట్టుపక్కల పురోహితం చేసుకుంటున్న పూజారి శశిధర్ శర్మ గారిని దారుణంగా హత్య చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ సంవత్సరంలో అనగా జనవరి నుండి ఇప్పటివరకు ఆరు హత్యలు పూజారులకు మాత్రమే జరిగింది కాకినాడలో విశాఖపట్నం నందు రాజమండ్రి నందు నంద్యాల నందు తిరుపతి కాణిపాకం నందు నిన్న హేమావతి గ్రామం అనంతపురం జిల్లా ఇలా గుడిలో పనిచేసుకుంటున్న బ్రాహ్మణులను టార్గెట్గా చేసుకొని హత్యలు చేయడం చాలా బాధాకరం కొన్ని స్థలాల్లో ధర్మకర్తల ఆధిపత్యం చూపిచ్చుకుంటూ పూజ చేసుకుంటున్న బ్రాహ్మణలను చూడము చాలా బాధాకరమైన విషయం ఈ మధ్యకాలంలో వెలుగోడు లో కూడా ఒక బ్రాహ్మణుడిపై కట్టేసి కొట్టడం కూడా చాలా బాధాకరం మరల బ్రాహ్మణ సంఘాలంతా వెళ్లి మాట్లాడితే ధర్మకర్త క్షమాపణ చెప్పడం కూడా జరిగింది అన్యమతస్తులు ధర్మకర్తలుగా ఉండడం వాళ్లకు దేవుడు చేసే కైకరాల గురించి ఏమీ తెలియదు ధర్మకర్త ఇంటికి ప్రసాదాల పంపీయకున్నా దేవుడికు వచ్చే పట్టు పట్టు వస్త్రాలు కూడా వాళ్లకి ఇవ్వకున్నా పూజారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు ఇవేమీ పట్టనట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మంత్రిగారు కూడా చూసి చూడనట్లు వెళుతూ ఉండడము చాలా సిగ్గుచేటుగా ఉన్నది దేవాలయంలో పూజ చేసుకున్న పూజారి ఉదయం నాలుగు గంటలకు వచ్చి స్వామికి అభిషేకం చేసి అలంకరణ చేసే సరికి రెండు మూడు గంటలు పడుతుంది ఉదయం అల్పాహారం తినాలన్నా కూడా ఆ సమయమునకు భక్తుడు వచ్చి స్వామి నాకు హారతి ఇచ్చి వెళ్లండి నేను వెళ్ళిపోతాను అన్నప్పుడు కచ్చితంగా హారతి ఇచ్చి వెళ్ళి పొయ్యి అల్పాహారం చేసి వద్దాం అనుకున్నప్పుడు నిదానంగా భక్తులు వచ్చే టైంలో పూజారి అల్పాహారం కూడా మానేసి దేవాలయంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి కష్టమైన పని పూజారింది కొంతమంది ఈ మధ్యకాలంలో బాగా చదువుకున్న పెద్ద మనుషులు బ్రాహ్మణుడికి ఏమి తెలుసు అన్ని మోసం మాటలు చెబుతారు అనడం కొంతమంది ప్రొఫెసర్లకు వాళ్లు విజ్ఞాన విజ్ఞతకు వదిలిపెడుతున్నాం భగవంతునికి భక్తునికి బ్రాహ్మణుడైన అను వ్యక్తి మధ్యవర్తిగా ఉంటారు తప్ప మిగతా విషయాల్లో జోక్యం చేసుకో కొంతమందికి పూజల మీద నమ్మకం ఉండకపోవచ్చు భగవంతుడు ఉన్నాడని నమ్మితే కచ్చితంగా దెయ్యాలు కూడా ఉంటాయి భగవంతుడు ఉన్నాడు అని నమ్మినవాడు దయ్యాలు ఉంటాయని కూడా నమ్మాలి అలాంటి దయ్యాలే బ్రాహ్మణులు విమర్శిస్తుంటారు ఒక బ్రాహ్మణుడు వేద విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు చిన్నప్పుడు 12 సంవత్సరాల నుండి వేద పాఠశాలకు వెళ్లి గురుకులంలో వేదాలు నేర్చుకుని రావడానికి 20 సంవత్సరాలు వయసు అవుతుంది బ్రాహ్మణుడు అనే వాడు ప్రతి ఒక్కడు పురోహితుడు కాదు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడే బ్రాహ్మణుడు ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం కరోనా టైంలో కర్ణాటక రాష్ట్రం కు చెందిన ఒక బ్రాహ్మణుల పిల్లవాడు యావత్తు ప్రపంచానికి గడియలు చెప్పిన వ్యక్తి జ్యోతిషం లెక్క వేసి కరోనా ఇన్ని రోజులు ఉంటుంది కరోనా మూడుసార్లు వచ్చి లాస్ట్ కు వెళ్ళిపోతుంది అని చెప్పిన వ్యక్తి బ్రాహ్మణుడు 12 సంవత్సరాల కుర్రవాడు ఇలాంటి విషయాలు తెలియక కొంతమంది ప్రొఫెసర్ మూర్ఖంగా మాట్లాడడం చాలా బాధాకరం ఈరోజు నుంచైనా బ్రాహ్మణులను చులకనగా మాట్లాడడం మానేయండి ఎవరి జాతి వారికి గొప్పది మన హిందూ జాతిలో ఒకరిని ఒకరిని కించపరుచుకోకుండా మాట్లాడినప్పుడే మనము భారతీయులం అనిపించుకుంటాం కొంతమంది ప్రొఫెసర్లకు చెప్తున్నాను మీరు బ్రాహ్మణులను విమర్శిస్తే మాకు మంచి పేరు వస్తుంది అనుకోవడం మీ మూర్ఖత్వం ఖబర్దార్ జాగ్రత్తగా మాట్లాడండి ఇకపై బ్రాహ్మణుల పైన గాని వారి ఆస్తుల పైన గాని వస్తే చూస్తూ ఊరుకో కూర్చో వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు జాగ్రత్త ప్రభుత్వం వారికి చిన్న విన్నపం దయచేసి మా బ్రాహ్మణుల పై దాడులు జరిపిన వారిని కఠినంగా శిక్షించాలని ఇలాంటి దాడులు జరగకుండా చూసుకున్న బాధ్యత మీపై ఉంటుందని కోరుచున్నాం మిగతా అన్ని మతస్తులను కూడా కోరుచున్నాము మనం మనం ఒకటిగా ఉండాలి కానీ కులం పేరుతో దూషించడం చాలా బాధాకరమైన విషయము ఇప్పటినుండి అయినా మనం మానుకొని అందరం కలిసి ఉందాం మీకు ఇంకొక ముఖ్య విషయం బ్రాహ్మణ వంశములో జ్యోతిష్యం ప్రకారం రాబోయే గడియలు చెప్పే వాళ్ళు ఉన్నారు శంకరాచారి గార్లు మరియు రామానాజార్చార్యులు గారు మధ్వాచార్యులు గారు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి లాంటివారు వీరు శాంతపురుషులు యుద్ధానికి అయినా సై అనే వాళ్ళు పరశురాముడు లాంటివారు తెలుగులో చాణిక్యుడు లాంటి వారు కూడా ఉన్నారు బ్రాహ్మణుల్లో ధైర్య సాహసాలకు ఉన్న వాళ్లు కూడా ఉన్నారు కావున అన్ని కుల సంఘ పెద్దలకు కోరుకోవడం ఒకరిని ఒకరు విమర్శించుకోకపోవడం మన కులం యొక్క గొప్పతనాన్ని ఆదర్శవంతులుగా అవుతారు ఇంతకన్నా ఇక ఏమి చెప్పలేం మీ సముద్రాల హనుమంతరావు జై బ్రాహ్మణ్ జై భారత్ మాత.