శ్రీ రామాలయం శతాబ్ధి బ్రహ్మోత్సవాలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలో 200 సం.ల చరిత్ర కలిగిన శ్రీ రామాలయం,పేట,వన్ టవున్ వద్ద గల శ్రీ రామాలయం బ్రహ్మోత్సవాలు ప్రారంభించి 99 సం.లు పూర్తి అయ్యి ఈ సంవత్సరం 100 సం.ల శతాబ్ది బ్రహ్మోత్సవాలు నిర్వ హించుకోబోతున్న ఈ శుభ సందర్భంలో ఏప్రిల్ 16 2025, బుధవారం ఉ.10:00 గం.లకు, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవము, సా.5:00 గం.లకు దివ్యమంగళ రథోత్సవము, జరుగుతున్నదని సమితి కార్యదర్శి ,ఆలయం ప్రధాన అర్చకులు మాళిగి హనుమేషాచార్య తెలియజేశారు. స్వాగత సమితి సభ్యులు,పురం ప్రముఖులు,కులస సంఘాల నాయకులు ,ధార్మిక సంస్థల ప్రతినిధులతో కొండారెడ్డి బురుజు వద్దగల షరాఫ్ బజార్ పై అంతస్తులో గల శ్రీ వెంకటాచలపతి కళ్యాణమంటపంలో నిర్వ హించిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ…హిందూ సమాజం లో పెద్ద ఎత్తున జరిగే ఉత్సవాలు , ఊరేగింపుల పట్ల జాగ్రత్త వహించాలని తగిన పోలీసు బందోబస్తుతో వాటిని నిర్వహించుకోవాలన్నారు . అనంతరం లలితా పీఠం వ్యవస్థాపకులు మేడా సుబ్రహ్మణ్యం(సుబ్బి స్వామి) మాట్లాడుతూ… రాబోయే రామాలయం శతాబ్ది ఉత్సవాల్లో మనం కర్నూలు నగరమే కాకుండా పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు విచ్చేసి 16 ఏప్రిల్ 2025 వ తేదీ నిర్వహించబడే రథోత్సవంలో వేలాదిమంది శ్రీరామ భక్తులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమంలో నీలి నరసింహ, భాను ప్రకాష్,యస్.ప్రాణేష్,డా.సి.ఏ.నగేష్, చిల్కూరు ప్రభాకర్, చిల్కూరు నందకిశోర్, విఠల్ శెట్టి,ఎలుకూరు ద్వారకా నాథ్, సందడి మహేశ్వర్,గోవిందరాజులు, ఈపూరి నాగరాజు, క్రెడాయ్ ఛైర్మన్ గోరంట్ల రమణ, కమలాపురం సునీల్, హేమలతమ్మ,కళ్యాణి,మాళిగి పావని, కల్కి మురళి , షరాఫ్ బజార్ అధ్యక్షులు , గోదాగోకులం,శ్రీ సద్గురు దత్తకృపాలయం, వెల్దుర్తి గుడిమెట్ల ఆంజనేయ స్వామి తదితర ధార్మిక సంస్థల ప్రతినిధులు,నరహరి,అనిల్, తదితరులు పాల్గొన్నారు.