NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హ‌రిహ‌ర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: శ్రీదేవి భూదేవి స‌మేత శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా నిర్వహించాల‌ని క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్ సూచించారు. న‌గ‌రంలోని సంక‌ల్ భాగ్ వెంక‌టేశ్వర‌స్వామి ఆల‌యంలోని హ‌రిహ‌ర‌క్షేత్రంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 16వ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ధ్వజారోహ‌ణ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న బ్రహ్మోత్సవాల‌పై నిర్వాహ‌కుల‌తో మాట్లాడారు. ఈ నెల 12వ తేదీ వ‌ర‌కు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తార‌ని తెలిపారు. ఉత్సవాల నిర్వహ‌ణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల‌న్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు క‌ల్లె చంద్రశేఖ‌ర్ శ‌ర్మ‌, కార్యద‌ర్శి రాజ‌శేఖ‌ర్ రావు, స‌ల‌హాదారులు మ‌నోహ‌ర్ రావు, కార్యవర్గ స‌బ్యులు మాధ‌వ ప్రభు, ప్రభాక‌ర్‌, సోమిశెట్టి ప్రకాశ్‌, బ్రాహ్మణ సంఘం స‌బ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author