కన్నులపండువగా మూడో రోజు బ్రహ్మోత్సవాలు
1 min read– గజవహనం పై విహరించిన మోక్షనారాయణుడు
పల్లెవెలుగు వెబ్ కమలాపురం : కమలాపురం మండలం రామాపురం క్షేత్రంలో వెలసిన శ్రీ మహాలక్ష్మి సమేత మోక్షనారాయణుడు, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు కన్నులపండువగా జరిగాయి. మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేద పండితులు సుదర్శన హోమం, స్త్రీ శక్తి హోమం, నవగ్రహ హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం మాడ వీధులలో మహాలక్ష్మి సమేత మోక్షనారాయణుడు గజవాహనం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి అశ్వవాహనం పై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ జడ్పి వైస్ ఛైర్మెన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మి రెడ్ది, పాలకొండరాయస్వామి దేవస్థానం మాజీ ఛైర్మెన్ ఓబుల్ రెడ్ది లు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయంలో మూల మూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో లక్ష్మిరెడ్దిని ఆలయ నిర్వాహకులు కాశిభట్ల సాయినాథ్ శర్మ ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ నిర్వాహకులు సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ చేశారు.