PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేటి నుండి జనహరి 15 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి త్రీ సప్తహ బ్రహ్మోత్సవాలు..

1 min read

ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు

29 సాయంత్రం ప్రముఖ ప్రవచనాకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం

బ్రహ్మోత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొనున్న భక్తులు

భక్తులకు అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం

చైర్మన్, కార్య నిర్వహణ అధికారి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రీసప్తాహ బ్రహ్మోత్సవాలను ప్రజలందరూ తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. గురువారం ఈరోజునుండి 21 రోజులపాటు జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నూర్జహాన్ పెదబాబు ఆరాల పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు.  అనంతరం ద్వాజరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూస్థానిక ఆర్ఆర్ పేటలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో  ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈరోజు ప్రారంభమై జనవరి 15 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ధర్మకర్తల మండలి వారు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా జరుగు బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి ప్రతిరోజు వేలాదిమంది ప్రజలు ఏలూరు నగరమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా తరలివచ్చి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు  తిలకించి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకత రేపు శుక్రవారం 29వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి  ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావు  ప్రసంగం స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం ఎంతో విశేషం అన్నారు. ఈ ధర్మకర్తల మండలి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుందన్నారు. వారు ఎంతో భక్తిశ్రద్ధలతో రెండు సంవత్సరాలు కాలంలో స్వామివారి ఆలయాన్ని సుమారు కోటి రూపాయలు పైగా విరాళాలు సేకరించి అభివృద్ధి చేసిన ధర్మకర్తల మండలి చైర్మన్,సభ్యులు,ఈఓ ను మేయర్ నూర్జహాన్ పెదబాబు అభినందించారు. తొలుత ధర్మకర్తల మండలి చైర్మన్  తోలేటి శ్రీనివాసరావు,కమిటీ సభ్యులు ఈవో సన్యాసిరావు, అర్చకులు మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, కార్పొరేటర్ సబ్బన శ్రీనివాసరావు,  కో-ఆప్షన్ సభ్యురాలు కొంపెల్ల మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

About Author