నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్ : గత నాలుగు రోజులుగా వరుస నష్టాలతో క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్.. శుక్రవారం లాభాల్లో ముగిసింది. ఉదయం ఫ్లాట్ గా ట్రేడింగ్ ప్రారంభించిన స్టాక్ మార్కెట్.. తర్వాత లాభాల్లోకి వెళ్లింది. ఫ్యూయెల్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, టెలికాం రంగాల నుంచి మద్దతు లభించడంతో మార్కెట్ లాభాల్లో పయనించింది. సెన్సెక్స్ 166 పాయింట్ల లాభంతో 52,484 వద్ద ట్రేడింగ్ ముగించింది. నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 15,722 వద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 151 పాయింట్లతో 34,835 వద్ద ట్రేడింగ్ ముగించింది.