NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాభాల‌కు బ్రేక్.. న‌ష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భార‌త స్టాక్ మార్కెట్ సూచీలు వ‌రుస లాభాల నుంచి బ్రేక్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిణామాల‌తో సూచీల సెంటిమెంట్ బ‌ల‌హీన‌ప‌డింది. ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య చ‌ర్చ‌లు ఓ కొలిక్కి రాక‌పోవ‌డంతో ఇన్వెస్ట‌ర్లు లాభాల స్వీక‌ర‌ణ‌కు మొగ్గు చూపారు. మ‌రోవైపు ర‌ష్యా పై యూకే ఆంక్ష‌ల్ని పెంచింది. చైనాలో క‌రోన వైర‌స్ విజృంభ‌ణ‌తో చైనా, హాంకాంగ్ సూచీలు భారీ న‌ష్టాలు చ‌విచూశాయి. యూర‌ప్ స్టాక్ మార్కెట్లు కూడ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో సెన్సెక్స్ 709 పాయింట్ల న‌ష్టంతో 55776 వ‌ద్ద‌, నిఫ్టీ 208 పాయింట్ల న‌ష్టంతో 16663 వ‌ద్ద ముగిశాయి.

                                    

About Author