NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రేకింగ్.. 879 కోట్ల హెరాయిన్ ప‌ట్టివేత

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆఫ్ఘాన్ నుంచి భారీ మొత్తంలో త‌ర‌లిస్తున్న హెరాయిన్ స్మగ్లర్ ను డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. స్మగ్లర్ నుంచి 879 కోట్ల విలువైన 300 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్, ఆఫ్గాన్ నుంచి అక్రమంగా త‌ర‌లిస్తున్న స‌ర‌కును జిప్సమ్ స్టోన్, టాల్కమ్ పౌడ‌ర్ గా అధికారులు గుర్తించారు. ప్రబ్ జోత్ సింగ్ అనే నిందితుడిని జేఎన్టీ వ‌ద్ద అరెస్టు చేశారు. ఏడాది నుంచి మ‌త్తు ప‌దార్థాల దందా నిర్వహిస్తున్నట్టు విచార‌ణ‌లో తేలింది. గ‌తేడాది ఆయుర్వేద మందుల పేరిట హెరాయిన్ స‌ర‌ఫ‌రా చేస్తున్న కంటెయిన‌ర్ ను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెరాయిన్ విలువ 1000 కోట్లు. ఈ హెరాయిన్ కూడ ఆఫ్గాన్ నుంచే స‌ర‌ఫ‌రా అయిన‌ట్టు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.

About Author