బ్రేకింగ్… భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగు వెబ్: భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాలు నమోదు చేశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ కదలికలు నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినింది. దీనికి తోడు గత వారం లాభాల్లో మార్కెట్లు పయనించాయి.. లాభాల స్వీకరణ కూడ భారీగా మార్కెట్లో నెలకొంది. దీంతో ఉదయం ట్రేడింగ్ భారీ గ్యాప్ డౌన్ తో మొదలైంది. 10 గంటల సమయంలో నిఫ్టీ 78 పాయింట్లు నష్టపోయి.. 15,721 వద్ద ట్రేడ్ అవుతుండగా.. బ్యాంక్ నిఫ్టీ 369 పాయింట్ల నష్టంతో 34,667 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది.