కొవ్వును వదిలిస్తుంది.. కరోన కట్టడి చేస్తుంది
1 min readపల్లెవెలుగు వెబ్ : కొవ్వు పదార్థాలను వదిలిస్తున్న ఓ ఔషధం.. ఇప్పుడు కరోన కట్టడిలో కూడ ఉపయోగపడుతుందని తాజా అధ్యయంనలో తేలింది. ఫెనో ఫైబ్రేట్ .. రక్తంలో అసాధారణ కొవ్వు పధార్థాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఫెనో ఫైబ్రేట్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కట్టడి చేయడానికి ఉపయోగపడుతుందని తేలింది. కరోన వైరస్ లోని స్పైక్ ప్రోటీన్.. మానవ కణాల్లోని ఏసీఈ2 ప్రోటీన్లతో అనుసంధానం కావడం ద్వార ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. వీటిని విచ్ఛిన్నం చేసే సామర్థ్యం ఫెనో ఫైబ్రేట్ కు ఉందని ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఔషధం తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. సురక్షితమైనదిగా కూడ వెల్లడైంది. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగిస్తారు.