బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల: స్థానిక నంద్యాల పట్టణంలో డివైఎఫ్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో ఢిల్లీలో గత 18 రోజుల నుంచి ఏడు మంది రెజ్లర్ క్రీడాకారులు క్రీడాకారులపై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ ని పార్లమెంటు నుంచి తొలగించి అరెస్టు చేయాలని ఈ సమావేశం నిర్వహించడం జరిగిందని ఈ సమావేశానికి డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న హాజరు అయ్యారని డివైఎఫ్ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ తెలిపారు. ఈ సందర్భంగా DYFI రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలాగా రెజ్లర్ల మహిళా క్రీడాకారులు బంగారు కాంక్ష పథకాలను ఒలంపిక్ టిక్కో ఒలంపిక్ లో సాధిస్తుంటే వారికి అండగా నిలవాల్సిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ బిజెపి ఎంపీ కంచె చేను మేసినట్లు కాపాడాల్సిన అధ్యక్షుడే వారే లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే వారి సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారి పైన చర్య తీసుకోవాలని జనవరి నెలలో ఆందోళనకు దిగితే ప్రభుత్వం కమిటీ వేసి విచారిస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలైనా పట్టించుకోకపోవడంతో కొద్ది రోజుల కిందట ఏడు మంది మహిళా రెజ్లర్ల క్రీడాకారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం ఇది తీవ్రమైన ఆరోపణ తక్షణమే ఢిల్లీ పోలీసులు స్పందించి చర్య తీసుకోవాలని ఆక్షేపించింది. అయినా సరే బిజెపి ఎంపీ ని కాపాడడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా లైంగిక వేధింపులకు గురైన క్రీడాకారుణులపైన వారి కుటుంబ సభ్యుల పైన దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడడం ఆర్థికంగా సహకరిస్తామని ఆశ పెట్టడం జరుగుతుందని ఆరోపించారు. ఐదు రోజులుగా రాత్రి పగలు ఎండ వాన అనకుండా రెజ్లర్ల క్రీడాకారులు జంతర్మంతర్లు ఆందోళన చేస్తుంటే దేశవ్యాప్తంగా మేధావులు ప్రజాసంఘాలు ముఖ్యంగా మహిళ రైతు సంఘాలు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్ లాంటి మేధావులు మద్దతుగా నిలుస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అవడం లేదని అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతుందని అన్నారు. బిజెపి ఎంపీలు మంత్రులు దేశంలో రోజుకొకరు లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు పాల్పడుతున్న బాధితుల పైన దాడులు చేసి చంపుతున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. లైంగిక వేధింపులకు అత్యాచారాలకు హత్యలకు దౌర్జన్యాలకు దాడులకు ప్రతికాగా బిజెపి నిలుస్తుందని ఆరోపించారు.ఆందోళన చేస్తున్న రేజ్లర్ల పై పాశవికంగా దాడులకు పాల్పడటం దారుణం అన్నారు.తక్షణమే మోడీ ప్రభుత్వం రెజ్లర్ల ఆందోళనకు స్పందించి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్ పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి తక్షణమే రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ నాయకులు వినీత్, సంజయ్, మధు, నాగూర్, తదితరులు పాల్గొన్నారు.