విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి వెలికి తీసే వ్యాసరచన పోటీలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా శనివారం నాడు (గడివేముల )శాఖా గ్రంధాలయం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు జడ్పీహెచ్ హైస్కూల్ నందు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఎనిమిదో తరగతి, తొమ్మిదవ తరగతి మరియు పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు 66 మంది పాల్గొన్నారు. ఈ విద్యార్థినీ విద్యార్థులకు 1. భారతదేశ ప్రజాస్వామ్యంలో ఓటు విలువ 2. స్వాతంత్ర ఉద్యమంపై మరియు సమాజంపై గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వి.వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో నెలకొన్న ప్రతిభను వెలికి తీసేందుకే విద్యార్థులకు ఇలాంటి ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను ముగింపు కార్యక్రమంలో బహుమతులను ప్రధానం చేస్తామని తెలిపారు. ఈ పోటీ పరీక్షలు జడ్పీహెచ్ హై స్కూల్ ఇన్చార్జి హెచ్ఎం మస్తాన్ . హై స్కూల్ టీచర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీ పరీక్షలకు ఆయా స్కూల్ టీచర్లు పాల్గొనడం జరిగింది.