పంచాంగ పఠనం.. సకల సంపత్కరం
1 min read
మాళిగి హనుమేషాచార్యులు
కర్నూలు: పంచాంగ పఠనం, శ్రవణం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పండితులు మాళిగి హనుమేషాచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని పేట శ్రీ రామాలయం నందు పంచాంగ పఠనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు ద్వాదశ రాశులవారి సంవత్సర ఫలితాలను వివరించారు. జరుగబోయే కాలం యొక్క ఫలితాలను ముందుగా ఊహించి, ధర్మబద్ధమైన జీవితానికి కట్టుబడి ఉండాలనేదే పెద్దలు మనకందించిన సందేశం అని వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, శ్రీ రామాలయ శతాబ్ది ఉత్సవ సమితి సభ్యులు మాళిగ వ్యాసరాజు, సతీశ్, సుధీంద్ర చిల్కూరి ప్రభాకర్, విఠల్ శెట్టి, నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.