విరిగిన బెంచీలు…దుమ్ము పట్టిన క్లాస్ రూమ్లు..
1 min read– అధ్వానంగా.. ఆత్మకూరు జూ. కళాశాల ఆవరణం..
– పరిశీలించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు షబానా..
పల్లెవెలుగువెబ్, ఆత్మకూరు: కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుతున్నారు. సువిశామైన విస్తీర్ణంలో ఉన్న కళాశాలకు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి కళాశాల భవనం.. ప్రస్తుతంం అధ్వానంగా ఉంది. తరగతి గదులలో ధుమ్ము ధూళి ఉండటం, బెంచీలు విరిగిపోవడం, వర్షాకాలంలో వర్షపునీరు గదులలోకి చేరడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానా పరిశీలించారు.
కొన్ని తరగతి గదులు ధుమ్ము, ధూళితో ఉండటం, బెంచీలు విరిగిపోవడం, కళాశాల ఆవరణంలో చెత్తాచెదారం పడి ఉండటం, స్లాబ్ పైకప్పు పెచ్చులూడి ఉండడం చూసి ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కళాశాలలో నెలకొన్న అనేక సమస్యలను విద్యార్థులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మోమిన్ షబానా మాట్లాడుతూ కళాశాల ఆవరణలోని కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరాయి. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. వినియోగానికి వీలు లేకుండా ఉన్నా యి.
కళాశాల ఆవరణంలో చెత్తాచెదారంతో నిండిపోయింది. పిచ్చి మొక్కలు, తుప్పలతో ఉంది. విష కీటకాలు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. ఇక కళాశాల తరగతి గదులు, లేబొరేటరీ పరికరాలు దుమ్ముతో నిండి పోయాయి. కొన్ని గదులలో డెస్కులు పూర్తిగా విరిగి మూలన పడవేశారు. గదులలో స్లాప్ పై పెచ్చులు ఎప్పుడూ వుడి విద్యార్థుల మీద పడతాయే అని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే కళాశాలకు ఈ దుస్థితి నెలకొందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు షబానా వెల్లడించారు.