PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రజ‌తం కంటే కాంస్య ప‌త‌క‌మే గొప్పది : సింధు

1 min read

Rio de Janeiro: India's Pusarla V Sindhu poses with her silver medal after her match with Spain's Carolina Marin in women's Singles final at the 2016 Summer Olympics at Rio de Janeiro in Brazil on Friday. PTI Photo by Atul Yadav (PTI8_19_2016_000286b)

ప‌ల్లెవెలుగు వెబ్ : ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. 26 ఏళ్ల సింధు ఒలింపిక్స్‌ సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో రెండు పతకాలు సాధించిన నాలుగో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్‌లోనూ స్వర్ణానికి గురిపెట్టినా నిన్న ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి తైజుతో జరిగిన హోరాహోరీ పోరులో ఓటమి పాలైంది. అయితే, అవకాశాలను జారవిడుచుకోకుండా చక్కని ఆటతీరుతో చైనాకు చెందిన హి బింగ్జియావోను వరుస సెట్లలో ఓడించి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. రియో రజత పతకం కంటే టోక్యో కాంస్య పతకం గొప్పదని పేర్కొంది. కాంస్యం కోసం తీవ్రంగా పోరాడాల్సి వచ్చిందని చెప్పింది.

About Author